ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Secretariat Security Boost: సచివాలయం భద్రత పెంపు

ABN, Publish Date - Apr 20 , 2025 | 04:32 AM

రాష్ట్ర సచివాలయంలో భద్రత పెంచేందుకు కొత్త సీసీ కెమెరాలు అమర్చగా, మొత్తం 310 కెమెరాలు ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇదివరకు ఉన్న 60 కెమెరాలకు అదనంగా 250 కొత్త కెమెరాలు జోడించి భద్రతా పర్యవేక్షణను మరింత పెంచింది.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయం పూర్తి నిఘా నీడలోకి వచ్చింది. సెక్రటేరియట్‌లో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా మరిం త పటిష్ఠం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పెరగడంతో పాటు భద్రతపరమైన బెదిరింపు ఫోన్లు వచ్చిన నేపథ్యంలో సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎఫ్‌) అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భవనం నాలుగు దిక్కులు కనబడేలా గ్రౌండు ఫ్లోరు నుంచి ఆరో అంతస్తు వరకు ‘మూడో కన్ను’నిత్యం ఓ కంట కనిపెట్టనుంది. ఈ మేరకు సచివాలయం మొత్తం 310 సీసీ కెమెరాలను అమర్చారు. వీటి పర్యవేక్షణ కోసం ఒక బృందం పనిచేస్తోంది. ఆరో అంతస్తులో గతంలోనే దాదాపు 60 వరకు కెమెరాలను ఏర్పాటుచేశారు. అదనంగా ఇప్పుడు మరో 250 వరకు కొత్త కెమెరాలను ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 20 , 2025 | 04:32 AM