ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెద్దన్న తుమ్మల.. చిన్నాయన వాకిటి

ABN, Publish Date - Jun 09 , 2025 | 03:42 AM

రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. దీంతో సీఎం రేవంత్‌ మినహా మంత్రుల సంఖ్య 14కు చేరింది. అయితే, వయసు పరంగా మంత్రివర్గంలో అందరి కంటే పెద్ద తుమ్మల నాగేశ్వరరావు.

రాష్ట్ర మంత్రివర్గంలో అంతా 50 ఏళ్ల పైబడినవారే

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. దీంతో సీఎం రేవంత్‌ మినహా మంత్రుల సంఖ్య 14కు చేరింది. అయితే, వయసు పరంగా మంత్రివర్గంలో అందరి కంటే పెద్ద తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం ఆయన వయస్సు 72 ఏళ్లు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాకిటి శ్రీహరి అందరికంటే పిన్నవయస్కులు. ఆయన వయసు 53 ఏళ్లు. ఇక, రాష్ట్ర మంత్రివర్గంలో అందరూ 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. 59 ఏళ్ల వయస్సు కలిగిన వారు ముగ్గురు, 53 ఏళ్ల వయస్సు వారు ఇద్దరు ఉన్నారు. తుమ్మల తర్వాత జూపల్లి కృష్ణారావు అత్యంత పెద్దవారు. ఆయన వయసు 69 ఏళ్లు. గడ్డం వివేక్‌ (67), దామోదర రాజనర్సింహ (66), భట్టివిక్రమార్క (63), ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి(62), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(60), పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌(59), పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌(58), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (56), ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (55), ధనసరి అనుసూయ(సీతక్క), వాకిటి శ్రీహరి (53) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సీతక్క 1971లో, శ్రీహరి 1972లో జన్మించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 03:42 AM