ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Staff Nurses: తెలంగాణ నర్సింగ్‌ డైరెక్టరేట్‌!

ABN, Publish Date - Jun 07 , 2025 | 03:16 AM

రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌ నర్సుల దశాబ్దాల కలను సాకారం చేసింది. రాష్ట్రంలో నర్సింగ్‌ డైరెక్టరేట్‌ (ఎన్‌డీ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం.. నెరవేరిన స్టాఫ్‌ నర్సుల దశాబ్దాల కల

  • త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలు

  • ఇక పదోన్నతులు, సర్వీస్‌ అంశాలు వేగంగా పరిష్కారం

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌ నర్సుల దశాబ్దాల కలను సాకారం చేసింది. రాష్ట్రంలో నర్సింగ్‌ డైరెక్టరేట్‌ (ఎన్‌డీ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా సర్కారీ దవాఖానాల్లో పనిచేస్తున్న నర్సులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఎన్‌డీ విభాగాధిపతిగా వైద్యులను నియమించాలని ప్రభుత్వం భావించగా.. అందుకు నర్సులు అంగీకరించలేదు. దాంతో ఎన్‌డీ ఏర్పాటు కూడా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఎన్‌డీ ఏర్పాటు చేస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించారు. అయినా అది కార్యరూపం దాల్చలేదు. నాటి నుంచి నర్సింగ్‌ అధికారుల సంఘాలు అనేకసార్లు వైద్యమంత్రులకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎన్‌డీ ఏర్పాటుకు సర్కారును ఒప్పించారు.


ఎన్‌డీతో ఏంటి లాభం?

నర్సింగ్‌ రంగంలో సమస్యలను పరిష్కరించి, ఆరోగ్యసేవలను మెరుగుపర్చడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాల్లో నర్సింగ్‌ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అందుకు సంబంధించి 2012 డిసెంబరు 24న జీవో జారీ చేసింది. ఎన్‌డీ ఏర్పాటుతో నర్సుల సర్వీస్‌ విషయాలు, పదోన్నతులు, ఖాళీల గుర్తింపు, సకాలంలో బదిలీలు వంటి అంశాలన్నీ దాని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం నర్సులు మూడు విభాగాధిపతుల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌), వైద్యవిద్య సంచాలకులు(డీఎంఈ), వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ (టీవీవీపీ) పరిఽధిలో సుమారు 18-20 వేల మంది వరకు పనిచేస్తున్నారు. అలాగే నర్సింగ్‌ విద్యలో పనిచేస్తున్న అధ్యాపకులు సైతం ఈ కేటగిరీలోకి వస్తారు. టీవీవీపీని కూడా సర్కారు సెకండరీ హెల్త్‌కేర్‌ డైరెక్టరేట్‌ కిందకు తీసుకురానున్న నేపథ్యంలో ఆ హెచ్‌వోడీ పరిధిలో పనిచేసేవారు సైతం ఎన్‌డీ పరిధిలోకే వస్తారని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇంత పెద్దసంఖ్యలో ఉన్న స్టాఫ్‌నర్సులకు సంబంధించి పదోన్నతులు, సర్వీస్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఏళ్లతరబడి ఆయా హెచ్‌వోడీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాగే నర్సుల డిప్యుటేషన్‌, వర్క్‌ ఆర్డర్లు, ఫారిన్‌ సర్వీస్‌ డిప్యుటేషన్‌ (ఎఫ్‌ఎ్‌సడీ) లాంటి విషయాల్లో కూడా కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఎన్‌డీ ఏర్పాటుతో ఇటువంటి సమస్యలన్నింటికీ అడ్డుకట్ట పడుతుందని స్టాఫ్‌ నర్సులు చెబుతున్నారు. దీంతో పాటు నర్సింగ్‌ విద్యను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యా ప్రమాణాల ద్వారా నిపుణులైన నర్సులను తయారు చేయడం, మాతా శిశు మరణాల రేటును తగ్గ్గించడమే లక్ష్యంగా ఎన్‌డీ పనిచేస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి.


డైరెక్టరేట్‌ నిర్మాణం

నర్సింగ్‌ డైరెక్టరేట్‌ నిర్మాణం, విభాగాధిపతి, డైరెక్టరేట్‌ ఎలా పనిచేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలోనే పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు ఇస్తుందని ఉన్నతాధికారులు చెప్పారు. ఎన్‌డీలో డైరెక్టర్‌, ఏడీ, డీడీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, తెలంగాణ నర్సుల పరీక్ష బోర్డు కార్యదర్శి ఉంటారని, పలు రాష్ట్రాల్లో ఇదే విధానం అమలవుతోందని తెలిపారు. అలాగే ఎన్‌డీ ఏర్పాటు, నిర్వహణ వ్యయాలపై ఆర్థిక శాఖ కూడా జీవో జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


ప్రభుత్వానికి కృతజ్ఞతలు

నర్సింగ్‌ డైరెక్టరేట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వ నర్సుల సంఘం ఆధ్వర్యంలో పదేళ్లుగా పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్‌డీ ఏర్పాటుకు ఆమోదం తెలపడం సంతోషకరం. అందుకు కృషి చేసిన మంత్రి దామోదర, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం.

-రూఢావత్‌ లక్ష్మణ్‌, ప్రభుత్వ నర్సుల సంఘం సంయుక్త కార్యదర్శి


హెచ్‌వోడీలతో సంబంధం లేకుండా కార్యకలాపాలు

వైద్యశాఖలో నర్సులంతా ఇప్పటిదాకా ఆయా విభాగాధిపతుల పరిఽధిలో పనిచేశారు. డైరెక్టరేట్‌ ఏర్పాటుతో స్వతంత్రంగా మా కార్యకలాపాలు నిర్వహించుకుంటాం. ప్రస్తుత నర్సుల పదోన్నతులు, సర్వీస్‌ అంశాల్లో ప్రస్తుతం విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇకపై దానికి చెక్‌ పడనుంది. సర్కారుకు కృతజ్ఞతలు.

-సుజాత రాథోడ్‌, నర్సింగ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు

Updated Date - Jun 07 , 2025 | 03:16 AM