Jagitial: ఏసీబీ వలలో రాయికల్ ఇన్‌చార్జి తహసీల్దార్
ABN, Publish Date - Jun 04 , 2025 | 05:13 AM
జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇన్‌చార్జి తహసీల్దార్ గణేశ్ రూ.15 వేల లంచం తీసుకునేందుకు యత్నించగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ ద్వారా లంచం అందుకున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు.
రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాయికల్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇన్‌చార్జి తహసీల్దార్ గణేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రాయికల్ మండలం సింగర్రావుపేట గ్రామ శివారులోని 42.5 గుంటల వ్యవసాయ భూమిని రవి అనే రైతు ఇతరులకు విక్రయించాడు. ఆ భూమిని కొన్నవారి పేరుపై రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇన్‌చార్జి తహసీల్దార్ గణేశ్ రూ.15 వేలు డిమాండ్ చేశాడు. ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఎండీ ముజాఫర్ ద్వారా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన రవి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారుల సూచన మేరకు ముజాఫర్‌కు రవి రూ.10 వేలు ఇచ్చాడు. అనంతరం ముజాఫర్ నుంచి గణేశ్ ఆ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 05:17 AM