ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పడుకున్నోడు పడుకున్నట్టే సజీవదహనం

ABN, Publish Date - Jun 08 , 2025 | 06:05 AM

జగద్గిరిగుట్టలో ఓ యువ కుడు ఇలానే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు 27 ఏళ్ల సాయికుమార్‌. షాట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలంటుకోవడంతోనే తమ కుమారుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు చెబుతుండగా స్థానికులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఇంట్లోంచి పొగలు.. కాసేపటికే ఇల్లు దగ్ధం

ఆ సమయంలో ఇంట్లో లేని తల్లిదండ్రులు

జగద్గిరిగుట్టలో ఘటన.. అనుమానాల్లేవన్న తల్లిదండ్రులు

జీడిమెట్ల, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు ఒంటికి మంటలంటుకొన్నా, లేదా నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నా ఏమాత్రం కదలకుండా మంచమ్మీద పడుకున్నవాడు పడుకున్నట్టే చనిపోతాడా? జగద్గిరిగుట్టలో ఓ యువ కుడు ఇలానే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు 27 ఏళ్ల సాయికుమార్‌. షాట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలంటుకోవడంతోనే తమ కుమారుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు చెబుతుండగా స్థానికులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఐ నర్సింహ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట మగ్ధూంనగర్‌కు చెందిన గజ్జి ఉపేందర్‌, ధనలక్ష్మి భార్యభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సాయికుమార్‌(27) ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. ఉపేందర్‌ స్థానికంగా రేషన్‌ డీలర్‌గా పనిచేస్తున్నాడు. సాయికుమార్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 9గంటలకు ధనలక్ష్మి సమీపంలోని శివాలయానికి వెళ్లింది. ఉపేందర్‌ కూడా బయటకు వెళ్లాడు. ఇంట్లో సాయి కుమార్‌ ఒక్కడే ఉన్నాడు. కొద్దిసేపటికి.. సాయికుమార్‌ గదిలోంచి దట్టంగా పొగలొచ్చాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఎదురుగా ఉన్న కిరాణాషాపు వారు గుర్తించి స్థానికుల సాయంతో ఫైర్‌సిబ్బందికి, పోలీసులకు సమాచార మిచ్చారు. ఫైర్‌సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. లోపలికి వెళ్లి చూడగా సాయికుమార్‌ మంచమ్మీద పడుకున్న స్థితిలోనే సజీవదహనమై కనిపించాడు. కొద్దిసేపటికి ఇంటికొచ్చిన ధనలక్ష్మి, ఉపేందర్‌.. ఇల్లు తగలబడిపోవడాన్ని చూసి దిగ్ర్భాంతికి గురయ్యారు. కుమారుడి మృతదేహం వద్ద భోరున విలపించారు. క్లూస్‌టీం అక్కడికి చేరుకొని.. పూర్తిగా కాలిపోయిన చార్జర్‌, పేలకుండా ఉండిపోయిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలానగర్‌ ఏసీపీ పి.నరేశ్‌ రెడ్డి ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. ఇంటికి ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సాయికుమార్‌ మృతికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వెల్లడించగలమని చెప్పారు.



ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:05 AM