ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Suryapet WhatsApp Incident: దారుణం.. వాట్సాప్‌లో ఎమోజీ పెట్టినందుకు హత్య..

ABN, Publish Date - Jul 22 , 2025 | 06:40 PM

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్‌లో ఎమోజీ పెట్టినందుకు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అసలేం జరిగిందంటే..

Suryapet WhatsApp Incident

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్‌లో ఎమోజీ పెట్టినందుకు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వచ్చే నెల ఆగస్టు 3న జిల్లాలో పద్మశాలి కులసంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రీరాముల రాములు, ఎలగందుల సుదర్శన్ అనే వ్యక్తుల మధ్య పోటీ జరుగనుంది.

ఈ ఎన్నికల నేపధ్యంలోనే గత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా శ్రీరాముల రాములు వాట్సాప్‌లో పోస్టులు పెట్టారు. అయితే, అప్పం శ్రీనివాస్‌కు మద్దతుగా మానుపూరి కృపాకర్ అనే వ్యక్తి ఎమోజీతో ఆ పోస్టుకు రిప్లై ఇచ్చారు. దీంతో మానుపూరి కృపాకర్‌పై శ్రీరాముల రాములు వర్గం దాడి చేసింది. ఈ దాడిలో మానుపూరి కృపాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Updated Date - Jul 22 , 2025 | 07:23 PM