Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
ABN, Publish Date - May 13 , 2025 | 07:42 PM
సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టగా అక్రమంగా 100 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా..
ప్రజలకు అండగా ఉంటూ అక్రమాలను అరికట్టాల్సిన పోలీసు అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలకు అలవాటు పడి పేద ప్రజలను వేధిస్తున్నారు కొందరు పోలీసు అధికారులు. తాజాగా ఓ డీఎస్పీ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సూర్యాపేట డిఎస్పి పార్థసారథి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దీంతో హయత్ నగర్‌లోని ఆయన నివాసంతో పాటు మరికొన్నిచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
డీఎస్పీ పార్థసారథి ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఆయన ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను కూడా గుర్తించారు. ఇల్లీగల్గా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. DSP పార్థసారధిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - May 13 , 2025 | 09:45 PM