Disability Rights: దివ్యాంగుల మహాగర్జనకు మద్దతివ్వండి
ABN, Publish Date - Jul 09 , 2025 | 07:08 AM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును కలిశారు. అనంతరం మందకృష్ణ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కోరిన మందకృష్ణ
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును కలిశారు. అనంతరం మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న చలో దివ్యాంగుల మహాగర్జనకు మద్దతు ఇవ్వాలని రాంచందర్‌రావును కోరినట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులకు పెంచిన పించన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు మహాగర్జన నిర్వహిస్తున్నట్లు మందకృష్ణ తెలిపారు.
Updated Date - Jul 09 , 2025 | 07:08 AM