Complaints Authority: పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఆఫీసు ప్రారంభం
ABN, Publish Date - Aug 04 , 2025 | 04:35 AM
రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ కార్యాలయాన్ని(ఎ్‌సపీసీఏ) బీఆర్‌కే భవన్‌లోని 8వ అంతస్తులో ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్ రావు ఆదివారం ప్రారంభించారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ కార్యాలయాన్ని(ఎ్‌సపీసీఏ) బీఆర్‌కే భవన్‌లోని 8వ అంతస్తులో ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్ రావు ఆదివారం ప్రారంభించారు. డీఎస్పీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన పోలీసు అధికారుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ఎస్‌పీసీఏను నెలకొల్పారు. జస్టిస్ శివశంకర్ రావు మాట్లాడుతూ ఈ అథారిటీ స్వతంత్రంగా పనిచేస్తుందని, పోలీసు సిబ్బంది దుష్ప్రవర్తన లేదా వారి అధికారాలను దుర్వినియోగం చేస్తే పౌరులు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Updated Date - Aug 04 , 2025 | 04:35 AM