Spot Admissions: 31న గురుకుల ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
ABN, Publish Date - Jul 30 , 2025 | 05:00 AM
గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన సీట్లకు ఈ నెల 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు.
ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన సీట్లకు ఈ నెల 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. బుధవారం నుంచి వెబ్‌సైట్‌లో ఖాళీ సీట్ల జాబితా అందుబాటులో ఉంటుందని తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలను పారదర్శకంగా మెరిట్ ఆధారంగా భర్తీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం వర్షిణి మీడియాతో మాట్లాడారు. గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఉన్న అన్ని సీట్లు భర్తీ అయ్యాయని ఆమె తెలిపారు. సంక్షేమ గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన పోషకాహార భోజనాలు అందించడానికి కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.
వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆగస్టు 15లోగా దరఖాస్తులు
గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్-2025లో అర్హత సాధించిన విద్యార్థినులు ఈ నెల 30 నుంచి ఆగస్టు 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలియజేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 30 , 2025 | 05:00 AM