ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Socialism: సంక్షోభాలకు ప్రత్యామ్నాయం కమ్యూనిజమే

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:10 AM

సామ్రాజ్యవాదం 21వ శతాబ్దంలో ఎలాంటి రూపం తీసుకుందనడానికి ట్రంప్‌ గెలుపు, ఆయన తీరే నిదర్శనం అని ప్రముఖ సామాజికవేత్త ఆచార్య హరగోపాల్‌ పేర్కొన్నారు.

  • సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని కబళిస్తోంది: హరగోపాల్‌

  • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంలో ప్రతాపరెడ్డి కృషి: కె. శ్రీనివాస్‌

  • స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాప రెడ్డి రచనలు ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): సామ్రాజ్యవాదం 21వ శతాబ్దంలో ఎలాంటి రూపం తీసుకుందనడానికి ట్రంప్‌ గెలుపు, ఆయన తీరే నిదర్శనం అని ప్రముఖ సామాజికవేత్త ఆచార్య హరగోపాల్‌ పేర్కొన్నారు. సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని కబళిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నయా ఉదారవాదం మానవీయ విలువలు సహా అన్నీ రంగాలను సంక్షోభంలోకి నెట్టివేసిందని, ఈ దశలో కార్ల్‌మార్క్స్‌ రచనలు, విశ్లేషణల అవసరం మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. అన్ని సంక్షోభాలకూ కమ్యూనిజం ఒక్కటే ప్రత్యామ్నాయం, అంతిమ పరిష్కారం కూడా అని హరగోపాల్‌ నొక్కి చెప్పారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ కార్యదర్శి, స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాప రెడ్డి రాసిన ‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉద్యమ ప్రస్థానం’, ‘విప్లవాల విప్లవం’ పుస్తకాల ఆవిష్కరణ సభ శనివారం నారాయణగూడలో జరిగింది.


ఈ సందర్భంగా ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ కార్మికులను పట్టించుకున్నంతగా కర్షకులను పట్టించుకోకపోవడం, సాంస్కృతిక విలువలు, మత విశ్వాసాలను విస్మరించడం.. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడటానికి ప్రధాన కారణమని విశ్లేషించారు. సీనియర్‌ సంపాదకుడు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంలో ప్రతాపరెడ్డి అవిరళ కృషి చేశారంటూ అభినందించారు. కుల సమస్యను పట్టించుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలమయ్యాయని ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ అన్నారు. కార్యక్రమంలో కవయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మి, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రతాపరెడ్డి 90వ జన్మదినం సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖులు శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. వారిలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, సీపీఐ తెలంగాణ నాయకులు చాడా వెంకట రెడ్డి, పశ్య పద్మ, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎస్‌. వీరయ్య, ప్రతాపరెడ్డి అల్లుడు తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, భారతి తదితరులున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 04:10 AM