Minister Komatireddy: మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తి
ABN, Publish Date - May 21 , 2025 | 05:42 AM
రానున్న మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇటీవల సొరంగం కూలిపోవడంతో జాప్యం ఏర్పడిందని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ, మే 20 (ఆంధ్రజ్యోతి): రానున్న మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇటీవల సొరంగం కూలిపోవడంతో పనుల్లో జాప్యం ఏర్పడిందని, నిలిచిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని జి.ఎడవల్లి గ్రామచెరువుకు సుమారు కోటి రూపాయలతో చేపట్టనున్న మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.
Updated Date - May 21 , 2025 | 05:43 AM