ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీకి శ్రవణ్‌రావు
ABN, Publish Date - May 15 , 2025 | 04:49 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్‌రావును పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
పీటీ వారెంట్ దాఖలు చేయనున్న సిట్
హైదరాబాద్, మే14 (ఆంధ్రజ్యోతి) : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్‌రావును పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసులో శ్రవణ్‌రావును పలుమార్లు సిట్ అధికారులు విచారించినాసహకరించని నేపఽథ్యంలో సుప్రీంకోర్టు శ్రవణ్‌రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని ఇప్పటికే సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి స్వల్ప ఊరటతో బయటపడిన శ్రవణ్‌రావు ఊహించని విధంగా చీటింగ్ కేసులో అరెస్టు కావడంతో సిట్ అధికారులకు ఇది అవకాశంగా మారింది.
Updated Date - May 15 , 2025 | 04:49 AM