ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Siddipet: ఏపీ ఈసెట్‌లో సిద్దిపేట విద్యార్థులకు టాప్‌ ర్యాంకు

ABN, Publish Date - May 17 , 2025 | 04:18 AM

డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్‌ (బీటెక్‌) ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2025లో సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొదటి, రెండో ర్యాంకులను దక్కించుకున్నారు.

మిరుదొడ్డి, మే 16 (ఆంధ్రజ్యోతి): డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్‌ (బీటెక్‌) ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2025లో సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొదటి, రెండో ర్యాంకులను దక్కించుకున్నారు. గురువారం విడుదల చేసిన ఏపీ ఈసెట్‌ -2025 ఫలితాల్లో ఈసీఈ విభాగంలో జిల్లాలోని అక్బర్‌పేట-భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కంట్లె రేవతి రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకును సాధించారు.


మొత్తం 200 మార్కులకు గాను ఆమె 169 మార్కులు పొందారు. ఇదే గ్రామానికి చెందిన నర్సింలు చెన్నవ్వల కుమార్తె నవ్య ఇదే విభాగంలో 155 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటికే వీరిద్దరూ సికింద్రాబాద్‌లోని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌లో ఈసీఈ చదువుతున్నారు. ఐఏఎ్‌సలు కావడమే తమ లక్ష్యమని రేవతి, నవ్య ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - May 17 , 2025 | 04:18 AM