ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Semiconductor: రాష్ట్రంలో సెమీ కండక్టర్ల ఉత్పత్తి కేంద్రం

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:31 AM

తెలంగాణలో త్వరలోనే సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు సదరన్‌ సిలికాన్‌ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్లు తైయేబ్‌ తాహిర్‌ అలీ..

పంజాగుట్ట, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలోనే సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు సదరన్‌ సిలికాన్‌ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్లు తైయేబ్‌ తాహిర్‌ అలీ, హర్ష మాలో తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిధరి ఇండస్ర్టీస్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ అంజిరెడ్డితో కలిసి వారు మాట్లాడారు. ఎలకా్ట్రనిక్‌ పరికరాల్లో విస్తృతంగా ఉపయోగించే సెమీ కండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని వారన్నారు. సెమీ కండక్టర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకు క్వార్ట్జ్‌తో తెలుగు రాష్ట్రాల్లోనే వాటిని ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన వెంటనే గిరిధరి ఇండస్ట్రీస్‌ సహకారంతో సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు వారు చెప్పారు. సంస్థను నెలకొల్పడం ద్వారా పలువురికి ఉపాధి కూడా లభిస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 06:31 AM