ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram Pushkaralu: ఐదోరోజు 60వేల మంది స్నానాలు

ABN, Publish Date - May 20 , 2025 | 05:45 AM

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో ఐదో రోజైన సోమవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వేములవాడలో మాత్రం భక్తులు భారీగా తరలివచ్చి నాలుగు గంటల పాటు క్యూలైన్లలో నిలబడి మొక్కులు చెల్లించారు.

సరస్వతీ పుష్కరాల్లో కాస్త తగ్గిన రద్దీ

భూపాలపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాల్లో ఐదో రోజైన సోమవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సోమవారం 60వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ పెద్దగా లేకపోవడంతో శని, ఆదివారాల్లో నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యలు సోమవారం కనిపించలేదు. సోమవారం నాసిక్‌ త్రయంభకేశ్వర్‌ ఫీఠాధిపతి శ్రీమహా మండలేశ్వర స్వామిజీ, హైకోర్టు జడ్జి నందిగొండ నర్సింగారావు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దంపతులు, ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచంద్రనాయక్‌, వైరా ఎమ్మెల్యే రాందా్‌సనాయక్‌, దేవాదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్‌ వెంకట్రావు, మాజీ మంత్రి మల్లారెడ్డి పుణ్యస్నానాలు చేశారు.

నిర్వహణలో రాష్ట్ర సర్కారు విఫలం: బండి

రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ సరస్వతీ పుష్కరాలపై లేకుండా పోయిందని, అందాల పోటీలకు రూ.300కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం పుష్కరాలకు మాత్రం రూ.35కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని... ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ముక్తీశ్వర ఆలయాల వద్ద బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా రూ.200కోట్లు విడుదల చేసి కాళేశ్వరం ఆలయాన్ని, క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేశారు.


వేములవాడకు 70 వేలకు మించి..

వేములవాడ కల్చరల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి 70 వేలకు పైగా వచ్చినట్లు ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో రాజన్న ఆలయ పరిసరాలు, క్యూలైన్‌ రద్దీగా కనిపించాయి. రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సుమారుగా నాలుగు గంటల క్యూలైన్‌లో నిరీక్షించారు. మొక్కులు చెల్లించుకుని పార్వతిపరమేశ్వరులను దర్శించుకున్నారు. ఆలయ గుడి చెరువులోని పార్కింగ్‌ స్థలం వాహనాలతో నిండిపోరు కనిపించింది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:45 AM