BJP: క్రీడా మైదానాన్ని రక్షించండి
ABN, Publish Date - Jan 21 , 2025 | 11:15 AM
జవహర్‌నగర్ కార్పొరేషన్(Jawaharnagar Corporation) పరిధిలోని సర్వే నంబర్ 704, 706లో గతంలో క్రీడామైదానానికి కేటాయించిన 5 ఎకరాల భూమిని రక్షించాలని కోరుతూ అడిషన్ కలెక్టర్‌కు జవహర్‌నగర్ బీజేపీ(Jawaharnagar BJP) నాయకులు వినతి పత్రం అందజేశారు.
- అడిషనల్ కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి
హైదరాబాద్: జవహర్‌నగర్ కార్పొరేషన్(Jawaharnagar Corporation) పరిధిలోని సర్వే నంబర్ 704, 706లో గతంలో క్రీడామైదానానికి కేటాయించిన 5 ఎకరాల భూమిని రక్షించాలని కోరుతూ అడిషన్ కలెక్టర్‌కు జవహర్‌నగర్ బీజేపీ(Jawaharnagar BJP) నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ అధికారులు సమగ్ర విచారణ జరిపి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలని కోరినట్లు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: MP Etala: ఎంపీ ఈటల ఆసక్తికర కామెంట్స్.. కాంగ్రెస్ పని అయిపోయినట్లే
స్పందించిన అడిషనల్ కలెక్టర్ విజేయేందర్‌రెడ్డి(Additional Collector Vijayender Reddy) ఆ స్థలం క్రీడా మైదానానికి చెందినదని, ఎవరైన అభ్యంతరం చెబితే రెవెన్యూ అధికారులకు(Revenue officers) ఫిర్యాదు చేయాలని సూచించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్‌నేత, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ముత్యం సుజాత, జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి, నాయకులు మహే్‌షగౌడ్, శివకేషవ్, శ్రీనివా్‌సగౌడ్, రాహుల్‌సింగ్, నోములు సాయినాథ్, బాలకృష్ణ, భానుప్రకాష్ తదితరులు ఉన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!
ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్?
ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా
ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 21 , 2025 | 11:15 AM