Poultry Farmers: రేవంత్‌రెడ్డికి పౌల్ట్రీ రైతుల క్షీరాభిషేకం
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:38 AM
తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్‌లోని పౌల్ట్రీ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి కటౌట్‌కు పౌల్ట్రీ రైతులు క్షీరాభిషేకం నిర్వహించారు.
బర్కత్‌పుర, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్‌లోని పౌల్ట్రీ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి కటౌట్‌కు పౌలీ్ట్ర రైతులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకర్ల మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు మాట్లాడుతూ.. పౌల్ట్రీ రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 5,000 ఉడకబెట్టిన కోడిగుడ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.
Updated Date - Apr 25 , 2025 | 04:38 AM