Polycet 2025: నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:09 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్-2025 కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది.
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్-2025 కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. రెండు దశల్లో మొత్తం సీట్ల భర్తీ ప్రక్రియ నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, పాలిసెట్ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
మొదటి విడతలో భాగంగా ఈ నెల 24 నుంచి 28వరకు ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్నవారి ధ్రువపతాల్ర పరిశీలన ఈనెల 26-29 వరకు ఉంటుంది. అనంతరం ఆప్షన్ల ఎంపిక ఈనెల 26 నుంచి జూలై 1 వరకు కొనసాగనుంది. జూలై4లోపు జాబితా విడుదల చేస్తారు. ఆ తర్వాత చివరి దశ కౌన్సెలింగ్ జూలై9న ప్రారంభమై 16న ముగియనుంది.
Updated Date - Jun 24 , 2025 | 04:09 AM