ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పిటిషన్‌.. మెట్రో పరేషాన్‌..

ABN, Publish Date - Mar 01 , 2025 | 06:55 AM

ఓల్డ్‌సిటీ మెట్రో పనులపై టెన్షన్‌ మొదలైంది. కారిడార్‌లో చేపడుతున్న 7.5 కిలోమీటర్ల పనుల్లో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలపై మెట్రో ప్రభావం ఎంత ఉంటుందో తెలిపేలా హెరిటేజ్‌ ఇంపాక్ట్‌ అసెస్‏మెంట్‌ జరగలేదని, పనులను తక్షణమే ఆపాలని యాక్ట్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ (ఏపీడబ్ల్యూఎఫ్‌) సంస్థ అధ్యక్షుడు మహమ్మద్‌ రహీమ్‌ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

- ఓల్డ్‌సిటీ పనులపై సందిగ్ధత

- కౌంటర్‌ దాఖలుకు ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: ఓల్డ్‌సిటీ మెట్రో(Old City Metro) పనులపై టెన్షన్‌ మొదలైంది. కారిడార్‌లో చేపడుతున్న 7.5 కిలోమీటర్ల పనుల్లో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలపై మెట్రో ప్రభావం ఎంత ఉంటుందో తెలిపేలా హెరిటేజ్‌ ఇంపాక్ట్‌ అసెస్‏మెంట్‌ జరగలేదని, పనులను తక్షణమే ఆపాలని యాక్ట్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ (ఏపీడబ్ల్యూఎఫ్‌) సంస్థ అధ్యక్షుడు మహమ్మద్‌ రహీమ్‌ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల తీర్పుపై ఉత్కంఠ


హైకోర్టు(High Court) ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏతో కలిసి కౌంటర్‌ దాఖలుకు సమాయత్తమవుతున్నారు. ఓల్డ్‌సిటీ కారిడార్‌కు సంబంధించిన భూసేకరణ పనులను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మొత్తం 1100 ఆస్తుల్లో భాగంగా ఇప్పటివరకు 220 మంది ఇంటి యజమానులకు, 250 మంది కిరాయిదారులకు తగిన పరిహారం అందించి ఇతర ప్రాంతాలకు పంపించారు. ఇదే సమయంలో ఖాళీచేసిన ఇళ్లు, కమర్షియల్‌ భవనాలను కూల్చివేయిస్తున్నారు.


ఇదిలాఉండగా, నూతనంగా నిర్మిస్తున్న చాంద్రాయణగుట్ట - ఎంజీబీఎస్‌ కారిడార్‌లో చార్మినార్‌, ఫలక్‌నుమా వంటి వారసత్వ కట్టడాలు ఉన్నాయని, తెలంగాణ హెరిటేజ్‌ యాక్ట్‌, ఇతర చట్టాల ప్రకారం స్వతంత్ర నిపుణుల కమిటీతో అంచనా వేయలేదని మహమ్మద్‌ రహీమ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


చార్మినార్‌, ఫలక్‌నుమాతో పాటు మొఘల్‌పురా టూంబ్స్‌, దారుల్‌షిఫా మసీదు తదితర వారసత్వ కట్టడాలు కూడా ఈ మార్గంలో ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకుని మెట్రోను ప్రత్యామ్నాయ మార్గంలో నిర్మించాలని పిటిషన్‌లో కోరారు. దీంతో పనులపై ప్రభావం పడుతుందా అని హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు

ఈవార్తను కూడా చదవండి: ఆధార్‌ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం

ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి

ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్‌ ఫిషర్‌’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2025 | 06:55 AM