Etala Rajender: నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల
ABN, Publish Date - Jun 06 , 2025 | 02:51 AM
కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది.
గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆయనను ప్రశ్నించనున్న కమిషన్
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకున్న విషయం విదితమే. ఈటల రాజేందర్ విచారణ అనంతరం... 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్ ప్రశ్నించనుంది.
Updated Date - Jun 06 , 2025 | 02:51 AM