ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వండి: పొన్నం

ABN, Publish Date - May 28 , 2025 | 05:22 AM

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇతర పెండింగ్ పర్యావరణ, అటవీ భూముల క్లియరెన్స్‌ మరియు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులపై సహకారం కోరారు.

న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. డీపీఆర్‌ను పరిశీలించి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌ అంశాలు, పర్యావరణ అనుమతులు, అటవీ భూముల క్లియరెన్స్‌, రోడ్డు విస్తరణ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అంశాలపై మాట్లాడారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. మంత్రి వెంట తెలంగాణ అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ (ఏవోఆర్‌) శ్రవణ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - May 28 , 2025 | 05:23 AM