Ozone Pollution: హైదరాబాద్‌లో భూతల ఓజోన్ కాలుష్యం
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:30 AM
తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో భూతల కాలుష్యం భారీగా పెరిగిపోతోంది.
ఈ వేసవిలో నాలుగు నగరాల్లో భారీగా నమోదు
న్యూఢిల్లీ, జూలై 16: తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో భూతల కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై నగరాల్లో ఈ ఏడాది వేసవిలో భారీ గా ఓజోన్ కాలుష్యం నమోదైనట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎ్‌సఈ) సంస్థ పేర్కొంది. మార్చి 1 నుంచి మే 31 వరకు 92 రోజులపాటు చేపట్టిన అధ్యయనంలో.. హైదరాబాద్‌లో 22 రోజులు ఓజోన్ కాలుష్యం సురక్షిత స్థాయిని దాటి నమోదైనట్లు తెలిపింది. 2024 వేసవితో పోలిస్తే.. 55 శాతం నాణ్యత పడిపోయినట్లు, అత్యధికంగా 51 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్‌గా నమోదైనట్లు వెల్లడించింది. ఇక ముంబైలో 32 రోజు లు సురక్షిత స్థాయిని దాటగా, గతేడాదితో పోలిస్తే 42 శాతం నాణ్యత పడిపోయింది.
అత్యధికంగా 90మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. కోల్‌కతాలో 22 రోజులు సురక్షిత స్థాయిని దాటింది. గతేడాది కన్నా 45 శాతం తక్కువ నాణ్యత నమోదైంది. బెంగళూరులో ఏకంగా 45 రోజులపాటు సురక్షిత స్థాయిని మించిపోయింది. అయితే గతేడాదితో పోలిస్తే 29 శాతం నాణ్యత పెరిగింది. నైట్రోజన్ ఆక్సైడ్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్‌తో కూడి ఉండే ఓజోన్.. వాహనాలు, విద్యుత్తు ప్రాజెక్టు లు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యకారక వాయువులతో ఏర్పడుతుంది. దీనిని నియంత్రించకపోతే ప్రజల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపే ప్రమా దం ఉందని సీఎ్‌సఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితరాయ్ చౌదరి అన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 05:30 AM