ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nizamabad: సౌదీలో నిజామాబాద్‌ వాసి అవస్థలు

ABN, Publish Date - Jul 15 , 2025 | 04:35 AM

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ తండాకు చెందిన మెగావత్‌ సంతోష్‌ ఉపాధి కోసం 18 నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు.

  • పెండింగ్‌లో ఉన్న 15 నెలల జీతం అడిగినందుకు దొంగతనం మోపిన కంపెనీ

  • వీసాను రద్దు చేసిన స్థానిక కోర్టు

  • రోడ్లపైనే తిండిలేక సంతోష్‌ ఇబ్బందులు

  • భారత్‌కు రప్పించాలని సీఎంను కోరుతూ సెల్ఫీ

నిజామాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ తండాకు చెందిన మెగావత్‌ సంతోష్‌ ఉపాధి కోసం 18 నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ బందర్‌ అల్దాబి కంపెనీలో పని చేశాడు. సంతోష్‌తో 18 నెలలు పనిచేయించుకున్న ఆ కంపెనీ మూడు నెలల జీతమే చెల్లించింది. మిగతా 15 నెలల జీతం ఇవ్వాలని అక్కడి లేబర్‌ కోర్టులో కేసు వేయగా.. అతనిపై డీజిల్‌ దొంగతనం కేసు వేసింది. అక్కడి కోర్టు సంతోష్‌కు 16 వేల రియాల్‌(రూ.3.66లక్షలు) జరిమానా విధించడంతో పాటు పదేళ్ల పాటు వీసాను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

దీంతో, సంతోష్‌ రెండు నెలలుగా రోడ్లపైనే జీవనం కొనసాగిస్తూ తిండి కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. తనను ఇండియాకు రప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన భర్తను ఇండియాకు రప్పించాలని భార్య రాణి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

Updated Date - Jul 15 , 2025 | 04:35 AM