ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nizamabad: అమెరికాలో గుండెపోటుతో నిజామాబాద్‌ జిల్లా వాసి మృతి

ABN, Publish Date - Jul 29 , 2025 | 05:16 AM

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడిన నిజామాబాద్‌ జిల్లా వాసి గుండెపోటుకు గురై మృతి చెందారు. వారాంతపు సెలవులను ఆస్వాదించేందుకు బోటింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కోటగిరి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడిన నిజామాబాద్‌ జిల్లా వాసి గుండెపోటుకు గురై మృతి చెందారు. వారాంతపు సెలవులను ఆస్వాదించేందుకు బోటింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామా బాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన వడ్లమూడి రాధాకృష్ణ, సరస్వతి దంపతుల కుమారుడు హరికృష్ణ (49).. ఆయన 25 ఏళ్ల క్రితమే అమెరికాకు వెళి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం వర్జినియాలో అంటూ అక్కడే పనిచేస్తున్నారు.

ఆయనకు భార్య శిల్ప, యుక్త, సరయు అనే ఇద్దరు ఆడ పిల్లలున్నారు. అయితే శనివారం తన స్నేహితుడి కుటుంబంతో కలిసి అక్కడి ఓ నదిలో బోటింగ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ఒక్కసారిగా గుండెపోటుకు గురై నదిలో పడిపోయారు. స్నేహితుడి కూతురు నదిలో దూకి హరికృష్ణను ఒడ్డుకు చేర్చి సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది.

Updated Date - Jul 29 , 2025 | 05:16 AM