ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సిగాచి ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ

ABN, Publish Date - Jul 02 , 2025 | 04:41 AM

పాశ మైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేసు నమోదు చేసింది.

  • సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌

హైదరాబాద్‌, పటాన్‌చెరు, గన్‌పార్క్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి) : పాశ మైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేసు నమోదు చేసింది. న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్‌ ఆధారంగా కంపెనీ బాధ్యులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ చేపట్టనుంది. సిగాచి యాజమాన్య ప్రతినిధులైన చిదంబరం షణ్ముఖనాథన్‌, గుంతక ధనలక్ష్మి, అమిత్‌రాజ్‌ సిన్హా, శనివారపు సర్వేశ్వర్‌రెడ్డి, వివేక్‌కుమార్‌, ఓరుగంటి సుబ్బరామిరెడ్డి, రవీంద్ర ప్రసాద్‌ సిన్హా, బిందు వినోదాన్‌పై హత్యగా పరిగణింపబడని(కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కేసు నమోదు చేయాలని పిటిషనర్‌ కోరారు.

కాగా ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. పారిశ్రామిక భద్రత చట్టం అమలుతో సహా లోపాలపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక అందజేయాలని కోరుతూ అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్‌, కార్మిక శాఖ కమిషనర్‌, సంగారెడ్డి ఎస్పీలకు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

Updated Date - Jul 02 , 2025 | 04:41 AM