NEET 2025 Result: నీట్-2025 ఫలితాల్లో నారాయణ విజయ పరంపర
ABN, Publish Date - Jun 15 , 2025 | 04:17 AM
నీట్-2025 ఆలిండియా క్యాటగిరీలలో నారాయణ విద్యార్థులు విజయం సాధించారని ఆ సంస్థ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి. శరణి నారాయణ పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నీట్-2025 ఆలిండియా క్యాటగిరీలలో నారాయణ విద్యార్థులు విజయం సాధించారని ఆ సంస్థ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి. శరణి నారాయణ పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరిలో మృణాల్ కిషోర్ ఝా 4వ ర్యాంకు, కేశవ్ మిట్టల్ 7వ ర్యాంకు, సౌమ్యశర్మ 14వ ర్యాంక్, కె.జీవన్ సాయికుమార్ 18వ ర్యాంకు, రూపయన్ పాల్ 20వ ర్యాంకు సాధించినట్లు వారు తెలిపారు. వీటితో పాటు 100 లోపు 22 ర్యాంకులు, 1000 లోపు 85 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని వెల్లడించారు.
ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో 10 లోపు 8 ర్యాంకులు, 100 లోపు 65 ర్యాంకులు, 1000 లోపు 216 ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా సింధూర నారాయణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ క్యాటగిరిలో మొదటి ర్యాంకు సాధించటం తెలుగు వారికి గర్వకారణమన్నారు. ఇంతటి విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప అభినందనలు తెలిపారు.
Updated Date - Jun 15 , 2025 | 04:17 AM