ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna sagar: సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల

ABN, Publish Date - May 24 , 2025 | 04:02 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కుడి కాలువకు గురువారం రాత్రి ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్‌, మే 23(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కుడి కాలువకు గురువారం రాత్రి ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. ఏపీలో కుడి కాలువ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం చెరువులు, కుంటలు నింపనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువకు 2, 3వ నంబరు తూముల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. రోజుకు సుమారు 5వేల క్యూసెక్కుల చొప్పున 10రోజుల్లో 4టీఎంసీల నీటిని విడుదల చేస్తారు.


సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 512.50 అడుగులుగా(135.9545టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాలువ ద్వారా 5,598 క్యూసెక్కులు, జంటనగరాలకు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు సాగర్‌ ప్రాజెక్టులో పూడికను అంచనా వేసి కనిష్ఠ నీటి మట్టాన్ని కేఆర్‌ఎంబీ అధికారులు తగ్గించారు. ప్రస్తుతం 505 అడుగులు(115.6540టీఎంసీలు)గా కనిష్ఠ నీటి మట్టాన్ని తీసుకున్నారు.

Updated Date - May 24 , 2025 | 04:02 AM