Home » Nagarjuna Sagar
కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద అర్ధరాత్రి వేళ నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం 4.69 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లు ఎత్తి 4.19 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి దిగవ భాగానికి 1.51లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని.. చెప్పారు.
పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ గోదావరి ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి
నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరగడంతో రాష్ట్రంలోని పలు డ్యాముల గేట్లను అధికారులు ఎత్తారు.
నాగార్జునసాగర్ జలాశయానికి వస్తున్న భారీ వరద నిర్వహణ సరిగ్గాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. జలాశయంలో బుధవారం ఉదయం 11 గంటల నాటికి నీటిమట్టం 589.2 అడుగులు, నిల్వ 309.65 టీఎంసీలకు చేరగా..
ప్రస్తుత సీజన్‌లో మూడో సారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. భీమా, తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలానికి 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
కృష్ణా ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతోంది. దీంతో ఒక్కొక్కటిగా ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసివేస్తున్నారు.