Share News

Nagarjuna Sagar: సాగర్‌కు వస్తున్న వరద నిర్వహణ సరిగా లేదు

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:26 AM

నాగార్జునసాగర్‌ జలాశయానికి వస్తున్న భారీ వరద నిర్వహణ సరిగ్గాలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. జలాశయంలో బుధవారం ఉదయం 11 గంటల నాటికి నీటిమట్టం 589.2 అడుగులు, నిల్వ 309.65 టీఎంసీలకు చేరగా..

Nagarjuna Sagar: సాగర్‌కు వస్తున్న వరద నిర్వహణ సరిగా లేదు

  • వరదలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తండి

  • తెలంగాణకు ఏపీ జలవనరుల శాఖ లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ జలాశయానికి వస్తున్న భారీ వరద నిర్వహణ సరిగ్గాలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. జలాశయంలో బుధవారం ఉదయం 11 గంటల నాటికి నీటిమట్టం 589.2 అడుగులు, నిల్వ 309.65 టీఎంసీలకు చేరగా.. కేవలం 2.4 టీఎంసీల మేర జలాశయాన్ని ఖాళీ (ఫ్లడ్‌ కుషన్‌)గా ఉంచారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌కు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ (ఇరిగేషన్‌) నరసింహమూర్తి లేఖ రాశారు.


ఎగువ పరీవాహకంలోని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలున్న నేపథ్యంలో సాగర్‌కి వచ్చే వరద మరింతగా పెరగనుందని, వరదలను సమీక్షిస్తూ దానికి తగ్గట్టూ క్రస్ట్‌ గేట్లను ఎత్తకపోతే దిగువన ఏపీలోని ప్రాజెక్టులకు ముప్పు ఏర్పడనుందన్నారు. ఎగువ నుంచి వరదను ప్రణాళికబద్ధంగా కిందికి విడుదల చేేసందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగర్‌ నుంచి దిగువన ఏపీలోని ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న వరదను అకస్మాత్తుగా పెంచకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాగర్‌ పటిష్టతకు భంగం కలగకుండా వ్యవహరించాలని, లేకుంటే దిగువ ప్రాంతాల్లోని ప్రజలు, ప్రాజెక్టులకు నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చే శారు.

Updated Date - Aug 14 , 2025 | 05:26 AM