Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్‌పై పర్యాటకుల ఆందోళన
ABN , Publish Date - Aug 16 , 2025 | 09:26 PM
నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ గేట్ ముందు పర్యాటకులు నిరసనకు దిగారు. ఇష్టారాజ్యంగా సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ.. ఫైరవీలు ఇచ్చే వారి కార్లను తనిఖీ చేయకుండా డ్యామ్ పైకి పంపిస్తున్నారని విమర్శిస్తున్నారు. మధ్యాహ్నం వరకే వందకు పైగా వాహనాలను డ్యామ్ పైకి పంపిస్తున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.
అయితే.. నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలు ఉన్న సమయంలో.. వేలాది మంది వచ్చే పర్యాటక ప్రాంతాల్లో సిబ్బంది ఇలా ప్రవర్తించడం సారికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైరవీలు ఇచ్చే వారి కార్లను తనిఖీ చేయకుండా.. డ్యామ్ పైన పంపడం వల్ల ఏదైనా.. జరగకూడనిది జరిగితే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పర్యాటక ప్రదేశాల్లో కూడా నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు