Water Inflow: ప్రాజెక్టులకు జోరుగా వరద!
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:55 AM
పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ గోదావరి ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి
గోదావరిలో కడెం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కృష్ణాలో సాగర్‌కు 1.99 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ గోదావరి ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. శనివారం సింగూరు ప్రాజెక్టుకు 31,421 క్యూసెక్కుల వరద రాగా.. 43 వేల క్యూసెక్కులకు దిగువకు వదిలిపెట్టారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. మరో కీలక ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌కు 1.04 లక్షల క్యూసెక్కుల వరద రాగా, 4,952 క్యూసెక్కులను విడిచిపెట్టారు. కడెం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. అంతేస్థాయిలో కిందకు విడిచిపెడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 48,046 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 12,986 క్యూసెక్కులను దిగువకు వదిలారు. అప్పర్ మానేరుకు 925 క్యూసెక్కులు, మిడ్ మానేరుకు 12 వేల క్యూసెక్కులు, లోయర్ మానేరుకు 682 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. ఇక లోయర్ గోదావరిలో ప్రాణహితపై ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి 3.73 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు.
సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బ్యారేజీకి 3.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 3.84 లక్షల క్యూసెక్కులను వదిలిపెట్టారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం)కు 1.69 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఔట్‌ఫ్లో 1.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక కృష్ణాబేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. అంతేస్థాయిలో కిందికి వదిలారు. నారాయణపూర్‌కు 50 వేల క్యూసెక్కుల వరద రాగా.. 49,500 క్యూసెక్కులను వదిలారు. జూరాల ప్రాజెక్టుకు 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 97 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. తుంగభద్ర జలాశయానికి 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 55 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.91 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ఫ్లో 2.01 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1.99 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 2.12 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు 22 గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. ఇటు పులిచింతల ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.96 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..