Share News

Nagarjuna Sagar: విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు

ABN , Publish Date - Oct 01 , 2025 | 10:17 AM

విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

Nagarjuna Sagar: విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు

నాగార్జున సాగర్‌: విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌(Nagarjuna Sagar) పైలాన్‌ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సాగర్‌ సీఐ శ్రీనునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి(Kukatpally)కి చెందిన జ్ఞానేందర్‌, సుమన్‌, మణికంఠ, వెంకటేష్‌, హర్షవర్ధన్‌, చాణుక్య ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సాగర్‌ సందర్శన నిమిత్తం మంగళవారం రెండు ద్విచక్రవాహనాలపై సాగర్‌కు చేరుకున్నారు. ప్రధాన డ్యామ్‌కు దిగువన ఉన్న పుష్కర ఘాట్‌ వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు.


city7.jpg

సాగర్‌ 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నందున వరద ఉధృతి అధికంగా ఉండటంతో చాణక్య(15) కొట్టుకుపోయాడు. స్నేహితులు 100కు కాల్‌ చేసి సమాచారమివ్వటంతో సీఐ శ్రీనునాయక్‌, ఎస్‌ఐ ముత్తయ్యతో ఘటనా స్థలానికి చేరుకుని జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం అఽధికంగా ఉండటంతో యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని సీఐ తెలిపారు. యువకుడి తల్లిదండ్రులు సుమన్‌, సౌమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2025 | 10:17 AM