ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వింత వ్యాధితో 6,500 కోళ్ల మృతి

ABN, Publish Date - Mar 17 , 2025 | 04:54 AM

మెదక్‌ జిల్లాలో ఓ కోళ్ల ఫారంలో ఒక్కరోజే 6,500 బ్రాయిలర్‌ కోళ్లు వింత వ్యాధితో మృతి చెందాయి. కొన్ని నెలలుగా జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో కోళ్ల ఫారాలలో బ్రాయిలర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో ఇలానే చనిపోయాయి.

  • మరో ఫామ్‌లో రెండు రోజుల్లో 4 వేల కోళ్లు కూడా

రాయపోల్‌, చిన్నశంకరంపేట, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మెదక్‌ జిల్లాలో ఓ కోళ్ల ఫారంలో ఒక్కరోజే 6,500 బ్రాయిలర్‌ కోళ్లు వింత వ్యాధితో మృతి చెందాయి. కొన్ని నెలలుగా జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో కోళ్ల ఫారాలలో బ్రాయిలర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో ఇలానే చనిపోయాయి. తాజాగా ఆదివారం గవ్వలపల్లి తండాకు చెందిన బానోత్‌ స్వామి నాయక్‌ కోళ్ల ఫారంలో 6,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి.


మరోవైపు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం జాలిగామ గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి రాయపోల్‌ మండలం రామారం గ్రామంలోని తన పౌలీ్ట్రఫామ్‌లో ఓ కంపెనీకి సంబంధించిన కోళ్లు పెంచుతున్నారు. రెండు రోజులుగా ఈ పౌలీ్ట్రఫామ్‌లో సుమారు 4 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.

Updated Date - Mar 17 , 2025 | 04:54 AM