Konda Vishweshwar Reddy: కేసీఆర్‌ను ఈటల సమర్థిస్తే రెండొందలశాతం తప్పు
ABN, Publish Date - Jun 08 , 2025 | 06:41 AM
తనకున్న సమాచారం ప్రకారం ఈటల అలా చెప్పలేదన్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌తోపాటు ఇంజనీర్లదే తప్పని, ఈటల పాత్ర లేదని చెప్పారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్‌ను ఈటల రాజేందర్ సమర్థిస్తే అది రెండొందల శాతం తప్పు అని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఈటల అలా చెప్పలేదన్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌తోపాటు ఇంజనీర్లదే తప్పని, ఈటల పాత్ర లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డిజైన్ చేసింది కేసీఆరేనని, అప్పట్లో కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో నాటి మంత్రులు హరీశ్, ఈటలకు కూడా అవకాశం ఉండేది కాదని పేర్కొన్నారు. కేసీఆర్‌కు తానా అంటే తందానా అనే నాయకులు, ఇంజనీర్లు మాత్రమే ఆ సమావేశాల్లో పాల్గొనేవారని చెప్పారు. పార్టీ ఎంపీగా తానూ కొన్ని సమావేశాలకు హాజరయ్యానని వివరించారు. కాళేశ్వరం దరిద్రమైన ప్రాజెక్టు అనివ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 06:41 AM