ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DK Aruna: కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలి: డీకే అరుణ

ABN, Publish Date - Jun 13 , 2025 | 03:57 AM

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని ఎంపీ డీకే అరుణ అన్నారు.

  • రైతులను ముంచిన కాంగ్రెస్‌ సర్కార్‌: పాయల

రాంనగర్‌/హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ 11 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో ఎన్ని రోజులు ఉంటారో తెలియదని, ఉన్నప్పుడే కాళేశ్వరం అవినీతిలో సూత్రధారులు, పాత్రధారుల పేర్లను వెల్లడించి విశ్వసనీయతను చాటుకోవాలన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్‌ మండిపడ్డారు. రూ.2 లక్షలకు పైగా లోన్‌ ఉన్న రైతులకు రుణమాఫీ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి వల్ల బ్యాంకర్లు రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారని చెప్పారు.

Updated Date - Jun 13 , 2025 | 03:57 AM