ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miss World: మహిళా భద్రతలో తెలంగాణ అద్భుతం

ABN, Publish Date - Jun 12 , 2025 | 04:26 AM

మహిళల భద్రత చర్యల్లో తెలంగాణ అద్భుతమని మిస్‌ వరల్డ్‌ ఓపల్‌ సుచాత షుంగ్‌సిరి అన్నారు. తమ దేశం థాయ్‌లాండ్‌లో మహిళా పోలీసులే కనిపించరని ఆమె పేర్కొన్నారు.

  • నన్ను కంటికిరెప్పలా చూసుకు న్న తెలంగాణ మహిళా పోలీసులు

  • మిస్‌ వరల్డ్‌ ఓపల్‌ సుచాత.. ఆమెకు వీడ్కోలు పలికిన అధికారులు

హైదరాబాద్‌, శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రత చర్యల్లో తెలంగాణ అద్భుతమని మిస్‌ వరల్డ్‌ ఓపల్‌ సుచాత షుంగ్‌సిరి అన్నారు. తమ దేశం థాయ్‌లాండ్‌లో మహిళా పోలీసులే కనిపించరని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ సుందరి పోటీల కోసం గత నెలలో హైదరాబాద్‌ వచ్చిన సుచాత.. బుధవారం నగరం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను హైదరాబాద్‌లో విమానం దిగిన దగ్గర నుంచి... తిరిగివెళ్లే వరకు ఇక్కడి పోలీసుల్లో సగం మంది మహిళా పోలీసులే తనకు కనిపించారని అన్నారు.

మహిళా పోలీసులే వెంట ఉండి తనని కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. తెలంగాణలో మహిళా భద్రతా చర్యలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇలాంటి మహిళా భద్రతా చర్యలు తమ దేశంలోనూ అమలు చేయాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వాన్ని కోరుతానని సుచాతషుంగ్‌సిరి వెల్లడించారు. కాగా, హైదరాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణమైన మిస్‌ వరల్డ్‌ సుచాతషుంగ్‌సిరికి రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతితో ఘనంగా వీడ్కోలు పలికారు.

Updated Date - Jun 12 , 2025 | 04:26 AM