ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Phone Tapping: మంత్రుల ఫోన్లూ ట్యాపింగ్‌

ABN, Publish Date - Jul 23 , 2025 | 05:48 AM

బీఆర్‌ఎస్‌ కీలక నేతలతోపాటు రాష్ట్ర మంత్రుల ఫోన్లనూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్యాపింగ్‌ ..

  • అంతా సీఎం రేవంత్‌ కనుసన్నల్లోనే: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ కీలక నేతలతోపాటు రాష్ట్ర మంత్రుల ఫోన్లనూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్యాపింగ్‌ చేయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. మంత్రుల ఫోన్‌ ట్యాపింగ్‌ విషయమై సౌత్‌ఫ్‌స్ట పత్రిక నిజాలు బయట పెట్టిందని ఆయన చెప్పారు. సీఎం తానే తప్పు చేస్తూ బీఆర్‌ఎస్‌ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని బుకాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయకుంటే ఇద్దరు మంత్రులు సరదాగా ఫోన్‌లో మాట్లాడుకున్న విషయం ఆయనకెలా తెలిసిందని ప్రశ్నించారు. సీఎం తన వద్దకు ఒక మంత్రిని పిలిపించుకుని ఆయన సంభాషణపై క్లాస్‌ తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీ అండతో పోలీసులతో కాకుండా ప్రైవేటు ఏజెన్సీలతో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ వాడుతూ ముఖ్యుల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌, అధికార కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని, ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కూడా భాగస్వాములేనని అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ముఖ్యుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామన్న ప్రవీణ్‌ కుమార్‌.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారో హైకోర్టుకు సీఎం రేవంత్‌ సీల్డ్‌ కవర్‌లో జాబితా సమర్పించాలని చెప్పారు. హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో ఓ కమిటీని వేయాలన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:48 AM