Telangana industries: కొత్త పరిశ్రమలు తెస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం
ABN, Publish Date - Jun 04 , 2025 | 04:59 AM
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఎవర్జెంట్ టెక్నాలజీస్ గ్లోబల్ వాల్యూ సెంటర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఇది 600 మందికి ఉపాధిని కల్పించగా, త్వరలో వెయ్యికి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణను ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్‌లకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదిన్నరలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు తెలిపారు.
ఎవర్జెంట్ టెక్నాలజీస్ గ్లోబల్ వాల్యూ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేసిన అమెరికాకు చెందిన ఎవర్జెంట్ టెక్నాలజీస్ గ్లోబల్ వాల్యూ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎవర్జెంట్ టెక్నాలజీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎవర్జెంట్ టెక్నాలజీస్ గ్లోబల్ వాల్యూ సెంటర్ ద్వారా ప్రస్తుతం 600 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఆ సంఖ్య వెయ్యికి చేరుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాదిన్నర వ్యవధిలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్‌కు తెలంగాణను హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చాలనే సంకల్పంతోనే ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని అభివృద్థి చేయబోతునామన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆవిష్కరణలకు హబ్‌గా తెలంగాణను మార్చేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి భవానీ శ్రీ, ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఎవర్జెంట్ టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో విజయ్ సజ్జ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 04:59 AM