Hyderabad: మస్తాన్‌సాయి తండ్రి పోలీసులతో బేరసారాలు
ABN, Publish Date - Feb 11 , 2025 | 07:32 AM
మస్తాన్‌సాయి(Mastan Sai)పై గుంటూరులో నమోదైన కేసులో చార్జ్‌షీట్‌ను తమకు అనుకూలంగా దాఖలు చేయాలని పోలీసులతో అతని తండ్రి జరిపిన బేరసారాల ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- వైరల్‌గా మారిన ఆడియో
హైదరాబాద్ సిటీ: మస్తాన్‌సాయి(Mastan Sai)పై గుంటూరులో నమోదైన కేసులో చార్జ్‌షీట్‌ను తమకు అనుకూలంగా దాఖలు చేయాలని పోలీసులతో అతని తండ్రి జరిపిన బేరసారాల ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనుమతి లేకుండా తన వీడియోలు తీశాడని, ప్రశ్నించిన తనపై విచక్షణా రహితంగా దాడిచేయడంతో పాటు లైంగికదాడి కూడా చేశాడని గతంలో ఏపీ గుంటూరులోని పట్టాభిపురం పోలీస్‌స్టేషన్(Pattabhipuram Police Station)లో మస్తాన్‌సాయిపై లావణ్య కేసు పెట్టింది.
ఈ వార్తను కూడా చదవండి: CS Shanthikumari: ట్యాంక్ బండ్‌పై ‘స్కైవాక్’ చేపట్టండి
ఈ కేసును నీరుగార్చేందుకు మస్తాన్‌సాయి తండ్రి పోలీసులతో బేరసారాలు ఆడినట్లు ఆడియోలో తెలుస్తోంది. తమకు అనుకూలంగా చార్జ్‌షీట్ దాఖలు చేస్తే, డబ్బులు ఇస్తామని పోలీసులతో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియా(Social media)లో వైరల్ అయింది. ఆ తర్వాత పోలీసులకు డబ్బు ఇచ్చి ఈ కేసును మస్తాన్‌సాయి, అతడి తండ్రి తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్ పాలన ఐఫోన్‌లా.. రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉంది
ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News
Updated Date - Feb 11 , 2025 | 07:32 AM