Hyderabad: హైదరాబాద్ సిటీలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు
ABN, Publish Date - Apr 30 , 2025 | 08:38 PM
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 147 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ.. 42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్లను నియామించారు. అంతేకాకుండా,
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. 147 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, 42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్లను నియామిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలోనే కొత్తవారిని కూడా నియామం చేశారు. కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు రేవంత్ సర్కార్ భారీ స్థాయిలో సిబ్బందిని కేటాయించింది.
1200 మంది సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం.. కొత్తగా 11 పోలీస్ స్టేషన్లు ,13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఏడు మహిళా పోలీస్ స్టేషన్లు మంజూరు చేసింది. అలాగే, రెండు కొత్త జోన్లు ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంది. ప్రతి జోన్‌కి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నుండి సిటీ మొత్తంలో 72 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయి. పోలీస్ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లను కేటాయించడంతో పాటు ఆయా పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ల బదిలీలు కూడా చేస్తుంది.
Updated Date - Apr 30 , 2025 | 08:38 PM