ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chevella: వైద్యం వికటించి వ్యక్తి మృతి!

ABN, Publish Date - May 30 , 2025 | 03:57 AM

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. వైద్యుని నిర్లక్ష్యంవల్లే తన తండ్రి మృతి చెందాడని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • వైద్యునిపై ఫిర్యాదు.. కేసు నమోదు

చేవెళ్ల, మే 29 (ఆంధ్రజ్యోతి): వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. వైద్యుని నిర్లక్ష్యంవల్లే తన తండ్రి మృతి చెందాడని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేవెళ్ల మండలం కేసారం గ్రామవాసి కళ్లెంల నర్సింలు(50) ఆరు నెలలుగా బొడ్డుపైన కణితి నొప్పితో బాధపడుతున్నాడు. దాని తొలగింపునకు ఈ నెల 28న చేవెళ్లలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికెళ్లగా అదే రోజు సాయంత్రం వైద్యుడు సర్జరీ చేశాడు.


గురువారం ఉదయం నర్సింలు కొడుకు శ్రీకాంత్‌ వచ్చి చూడగా.. నోరు ఎండిపోతోందని.. దాహం దాహం అని నర్సింలు అడగడంతో తండ్రిని పైకి లేపడానికి యత్నించగా సహకరించలేదు. ఈ విషయం డాక్టర్‌కు చెప్పగా సెలైన్‌ ఎక్కించాడు. కొద్దిసేపటికి సెలైన్‌ ఎక్కడం లేదని శ్రీకాంత్‌ చెప్పగా వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో తండ్రికి సరైన వైద్యం అందడం లేదని శ్రీకాంత్‌ మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 03:57 AM