ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mala Groups: వర్గీకరణపై భగ్గుమన్న మాలలు

ABN, Publish Date - Feb 06 , 2025 | 04:29 AM

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై మాలలు భగ్గుమన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ ఆరోపించింది.

  • సీఎం దిష్టిబొమ్మ దహనం.. బ్లాక్‌డేగా ఫిబ్రవరి 4: జేఏసీ

  • మాలలు కాంగ్రె్‌సను వీడాలి..మాల సంఘాల జేఏసీ నేతలు

  • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు

ఉస్మానియా యూనివర్సిటీ/కవాడిగూడ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై మాలలు భగ్గుమన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ ఆరోపించింది. దీన్ని నిరసిస్తూ.. ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేత మాదాసు రాహుల్‌ మాట్లాడుతూ.. వర్గీకరణ వల్ల మాలలు నష్టపోయారని, ఫిబ్రవరి 4ను బ్లాక్‌ డేగా ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తడి గుడ్డతో మాలల గొంతు కోశారని ఆరోపించారు. అసెంబ్లీ హౌస్‌కమిటీ వేయకుండా మాల-మాదిగ ప్రతినిధులను సంప్రదించకుండా వర్గీకరణ చేయడం సరికాదన్నారు.


ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ పార్టీని మాలలు వీడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు జేఏసీ నేతలు-- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, తెలంగాణ మాల జేఏసీ ప్రతినిధి చెరకు రాంచందర్‌ తదితరులు లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కొంతసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది. ఈ సందర్బంగా చెన్నయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మాలలను మోసం చేసిందని ఆరోపించారు. తక్కువ రిజర్వేషన్లతో మాలలకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రె్‌సలోని మాల ప్రజాప్రతినిధులు వెంటనే పార్టీని వీడి.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోకుంటే.. కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


జిల్లాల్లో నిరసనలు

వర్గీకరణను నిరసిస్తూ మాలమహానాడు ఆధ్వర్యంలో బుధవారం జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ముందు, వరంగల్‌ కాశీబుగ్గ కూడలిలో ఆందోళనకారులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. భైంసా, రాజన్న-సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో, ఖమ్మం అంబేడ్కర్‌ సెంటర్‌లో, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..

Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..

Updated Date - Feb 06 , 2025 | 04:29 AM