ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: కులగణన, ఎస్సీ వర్గీకరణ.. టీకాంగ్రెస్‌ విజయాలు: మహేశ్‌ గౌడ్‌

ABN, Publish Date - May 06 , 2025 | 05:08 AM

కులగణన, ఎస్సీ వర్గీకరణ రెండూ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన గొప్ప విజయాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కులగణన, ఎస్సీ వర్గీకరణ రెండూ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన గొప్ప విజయాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఒత్తిడి వల్లే జనగణనతో పాటు కులగణన చేపడతామంటూ కేంద్రం ప్రకటించిందని చెప్పారు. గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్‌ను కలిసిన గౌడ సంఘం నేతలు.. ఖమ్మంలో గౌడసంఘం భవన నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు.


మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించి.. నిధులు ఇప్పిస్తానంటూ మహేశ్‌గౌడ్‌ హామీనిచ్చారు. తాను గౌడ్‌గా పుట్టినందుకు గర్విస్తున్నానని.. రాజకీయంగా గౌడ్‌లు ఎదగాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ (ఏఐపీసీ) తలపెట్టిన మన్మోహన్‌సింగ్‌ ఫెలోషిప్‌ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని మహేశ్‌గౌడ్‌ ఆవిష్కరించారు.

Updated Date - May 06 , 2025 | 05:08 AM