బీసీ సంఘాలు ప్రతిపక్షం ట్రాప్‌లో పడొద్దు!
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:38 AM
రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని, ప్రతిపక్ష నేతల ట్రాప్‌లో పడొద్దని బీసీ సంఘాల నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.
శాస్త్రీయంగా కులగణన: మహేశ్ గౌడ్
లైన్ దాటితే చర్యలు తప్పవని స్పష్టం
బీసీలకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?: పొన్నం
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని, ప్రతిపక్ష నేతల ట్రాప్‌లో పడొద్దని బీసీ సంఘాల నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా 56 శాతంగా ఉన్నట్లు కులగణన సర్వే చెబుతున్నా.. ప్రతిపక్ష నేతలు బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో కలిసి ఆయన మాట్లాడారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీసీ కులగణన జరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. కులగణనపైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి బదులు మంచి సూచనలిస్తే బాగుంటుందని హితవు పలికారు. కులగణన నివేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంపై స్పందిస్తూ పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆ పని క్రమశిక్షణా చర్యల కమిటీదని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బీసీలకు ఏం చేశారో చార్మినార్, బల్కం పేట ఎల్లమ్మగుడి వద్ద చర్చకు సిద్ధమా అంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి పొన్నం సవాల్ విసిరారు. బీఆర్‌ఎ్‌సలో హక్కులు అడిగినందుకు బీసీ నేత అయిన ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి గెంటేశారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో 3 కీలక పదవులు ఒకరికే ఉన్నా అడిగే దమ్ము ఆ పార్టీలో ఎవరికైనా ఉందా అని నిలదీశారు. అసలు కులగణనలో పాల్గొనని వారికి కులగణన గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదన్నారు. పొరపాట్లు ఉంటే బాధ్యతగా సరిచేస్తామని.. కుట్రదారుల ట్రాప్‌లో పడొద్దని బీసీ సంఘాల నేతలను కోరారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కులగణన సర్వే అనేది చారిత్రాత్మకమని, ఇది రెండు బీసీ కులాల ప్రతినిధిగా చెబుతున్నానన్నారు. కులగణన సర్వే అమలును అడ్డుకుంటే మనకే నష్టమని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రం వచ్చిన 76 ఏళ్లు తర్వాత బీసీలకు న్యాయం జరగబోతోందని సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..
Updated Date - Feb 06 , 2025 | 04:38 AM