ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Parents Appeal: దుబాయ్‌ జైల్లోని మా కుమారుడిని విడిపించండి

ABN, Publish Date - May 14 , 2025 | 03:19 AM

జగిత్యాల జిల్లా వాసులైన మల్లారపు మధుకర్‌ దుబాయ్‌లో జైలుకెళ్లారు. అతడిని విడిపించాలని తల్లిదండ్రులు ప్రజావాణి ద్వారా విజ్ఞప్తి చేశారు.

  • ప్రజావాణిలో జగిత్యాల వాసుల వినతి

బేగంపేట, మే 13 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి, అనుకో కుండా జైలుపాలైన తమ కుమారుడిని రక్షించాలని బాధితుడి తల్లిదండ్రులు ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌కు చెందిన మల్లారపు మధుకర్‌(27)ఉపాధికోసం దుబాయ్‌ వెళ్లాడు. అతడి బ్యాంకు ఖాతాను మరొకరు దుర్వినియోగం చేసి లావాదేవీలు జరిపినందున అజ్మాన్‌లోని కోర్టు మధుకర్‌పై ప్రయాణ నిషేధం(ట్రావెల్‌ బ్యాన్‌) విధించింది. భారత్‌కు వచ్చేందుకు యత్నించిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మధుకర్‌ తల్లిందండ్రులు మల్లవ్య, అంజయ్య మంగళవారం బేగంపేటలోని ప్రజాభవన్‌కు వచ్చారు. ఎన్నారై అడ్వైజరీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి.. బాధితులను ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డికి పరిచయం చేసి, సాయంం చేయాలని కోరారు. మధుకర్‌కు కాన్సులర్‌ సహాయంతో తెలంగాణకు రప్పించాలని అతడి తల్లిదండ్రులు అభ్యర్థించారు. సీఎంవో ద్వారా సమస్య పరిష్కరానికి చర్యలను తీసుకుంటామని చిన్నారెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

Updated Date - May 14 , 2025 | 03:20 AM