ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఆ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు

ABN, Publish Date - Feb 21 , 2025 | 04:34 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల తెరవెనుక నాటకం

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

యాదాద్రి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మార్పు ఏమీ లేదని, బీఆర్‌ఎస్‌ స్థానంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారని, గత సీఎం మాదిరిగానే ప్రస్తుత సీఎం తీరు ఉందని విమర్శించారు. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విస్మరించారని, రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా మూడు డీఏలు, కాంగ్రెస్‌ వచ్చాక రెండు డీఏలు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భూపాలపల్లిలో రాజలింగమూర్తి దారుణహత్యను ఖండిస్తున్నామని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 21 , 2025 | 04:34 AM