Kalvakuntla Kavitha: దాశరథి జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి
ABN, Publish Date - Jun 07 , 2025 | 04:46 AM
ఈనెల 20, 21న దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, ప్రభుత్వం నిర్వహించకపోతే ..
లేదంటే జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం: ఎమ్మెల్సీ కవిత
సుభాష్‌నగర్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఈనెల 20, 21న దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, ప్రభుత్వం నిర్వహించకపోతే జూలైలో జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ ఖిల్లా జైలును ఆమె సందర్శించారు. అక్కడ నెలకొల్పిన దాశరథి కృష్ణమాచార్య విగ్రహాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దాశరథి జయంతి సంవత్సరం అని, ప్రభుత్వం ఆయన శత జయంతి ఉత్సవాలను మర్చిపోయిందన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 04:46 AM