ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: ప్రధాన పుష్కర ఘాట్‌ వద్ద సరస్వతి విగ్రహం!

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:34 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు దేవాదాయ శాఖతో పాటు ఇతర విభాగాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

  • మహాబలిపురం నుంచి తీసుకురానున్న అధికారులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు దేవాదాయ శాఖతో పాటు ఇతర విభాగాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. సుమారు 120 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించగా రూ.35 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరు చేసింది. అలాగే ప్రధాన పుష్కర ఘాట్‌ వద్ద 20 అడుగుల ఎత్తులో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. మహాబలిపురంలో ప్రత్యేకంగా తయారుచేయించి తెప్పిస్తున్నారు. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభించేందుకు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ముహుర్తం నిర్ణయించారు. 26 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి.


ఇదే విషయాన్ని ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీకి తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో దేవాదాయ శాఖ అధికారులు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్‌, భద్రత తదితర అంశాలపై అధ్యయనం చేసి వచ్చి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

Updated Date - Apr 06 , 2025 | 04:34 AM