Kaleshwaram: ఆ బ్యారేజీల్లో సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సతో పరీక్షలు
ABN, Publish Date - May 31 , 2025 | 05:18 AM
జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర నీటి, విద్యుత్తు పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ద్వారా పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్‌ఈకి రామగుండం చీఫ్ ఇంజనీర్ లేఖ
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర నీటి, విద్యుత్తు పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ద్వారా పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని రామగుండం చీఫ్ ఇంజనీర్ శుక్రవారం ఎస్‌ఈకి లేఖ రాశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పరీక్షల కోసం రూ.19.4 కోట్లు కానుండగా.. వెంటనే సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు. పరీక్షల అనంతరం ఇచ్చే నివేదిక ప్రకారం ప్రణాళికను సిద్ధం చేసి, బ్యారేజీల మరమ్మతులకు సీడబ్ల్యూసీ ఆమోదం తీసుకోనున్నారు.
Updated Date - May 31 , 2025 | 05:18 AM